ప్రమాదవశాత్తు బావిలో పడిన హార్వెస్టర్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-19 13:10:24  IST  )

ప్రమాదవశాత్తు హార్వెస్టర్ బావిలో పడిన విషాద ఘటన మండలంలోని నందగిరి గ్రామంలో చోటు చేసుకుంది.

ప్రమాదవశాత్తు బావిలో పడిన హార్వెస్టర్
X

దిశ, పెగడపల్లి : ప్రమాదవశాత్తు హార్వెస్టర్ బావిలో పడిన విషాద ఘటన మండలంలోని నందగిరి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందగిరి గ్రామానికి చెందిన పాలకొల మధు హార్వెస్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వరి కోతలో భాగంగా పొలంలో దిగే సమయంలో హార్వెస్టర్ నేరుగా వ్యవసాయ బావిలోకి వెళ్ళి బోల్తా పడింది. డ్రైవర్ కి గతంలో ఫిట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయని హార్వెస్టర్ నీటిలో మునిగి పోవడం తో డ్రైవర్ ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కిరణ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లక్ష్మణ్ కుమార్

ప్రమాదవశాత్తు బావిలో హార్వెస్టర్ పడిన ఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృత దేహం బయటకు తీసేందుకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ నిఆదేశించారు. ఆ బావి వ‌ల్ల గతంలో ప్రమాదాలు జరిగాయని, బావికి రక్షణ చర్యలు చేపట్టాలని కోరగా సమస్య పరిష్కారంకి అధికారులను మంత్రి ఆదేశించారు.

Next Story