మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

by Ratna Kumari |

A great tribute to the municipal administration

మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం
X

దిశ, మంథని : మంథని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేంధర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్ల‌ ను కార్మికులు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సబ్బులు, నూనెలు, దుస్తుల కూలీ డబ్బులు ఇవ్వాలన్నారు. అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలు తీసుకుంటూ నష్టపోతున్న ఎన్ ఎం ఆర్ కార్మికులను కాంట్రాక్టు లిస్టులో విలీనం చేయాలి. ఈ మధ్యకాలంలో తీసుకున్న ఆరుగురు కార్మికులను కూడా కాంటాక్ట్ పద్ధతిలోకి తీసుకురావాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్మికులు నూతన పాలకవర్గానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారుడు చింతల గోవింద్, గౌరవధ్యక్షుడు బూడిద గణేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెెంకల సురేష్, యూనియన్ నాయకులు మల్లేష్, చందు, గట్టయ్య, జంపయ్య,అనిల్, రాజయ్య, భాగ్య, పోచమ్మ పాల్గొన్నారు.

Next Story