లారీ - ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

by Nallavelli.Anjaneyulu |

శంకరపట్నం మండలంలోని మొలంగూరు శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

లారీ - ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూరు శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్ పల్లి గ్రామానికి చెందిన వంగల సంపత్ రెడ్డి, అంతడుపుల నరేష్ అను వ్యక్తులు ద్విచక్ర వాహనంపై కేశవపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వారి స్వగ్రామం మెట్ పల్లి కి వెళ్లుండ‌గా.. మొలంగూరు గ్రామ శివారులోకి రాగానే ద్విచక్ర వాహనం లారీ ఎదురెదురుగా ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని 108 లో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story