గన్నేరువరం-యాస్వాడ మార్గంలో బ్రిడ్జి నిర్మించాలి

by Elthuri vijay kumar |

గన్నేరువరం-యాస్వాడ మార్గంలో మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గన్నేరువరం గ్రామస్తులు శుక్రవారం మండల కేంద్రంలో సంతకాల సేకరణ నిర్వహించారు.

గన్నేరువరం-యాస్వాడ మార్గంలో బ్రిడ్జి నిర్మించాలి
X

గన్నేరువరం-యాస్వాడ మార్గంలో బ్రిడ్జి నిర్మించాలి

ప్రభుత్వానికి గన్నేరువరం గ్రామస్తుల వినతి

దిశ , గన్నేరువరం: గన్నేరువరం-యాస్వాడ మార్గంలో మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గన్నేరువరం గ్రామస్తులు శుక్రవారం మండల కేంద్రంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. యాస్వాడ మీదుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే మండల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, జిల్లా కేంద్రానికి దూర భారం తగ్గుతుందని అన్నారు. చొక్కా రావు పల్లి వద్దు గన్నేరువరం ముద్దు అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లల లక్ష్మీ లక్ష్మణ్, మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు, బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్, నాయకులు పుల్లెల జగన్, గంప వెంకన్న, కటకం తిరుపతి, బుర్ర తిరుపతి గౌడ్, నేత సుధాకర్, చింతల శ్రీధర్ రెడ్డి , బూర వెంకటేశ్వర్లు, పుల్లెల రాము , గొల్లపల్లి రవి అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story