మెట్‌పల్లి రేంజ్ పరిధిలో పెద్ద పులి కలకలం

by Nallavelli.Anjaneyulu |

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రేంజ్ పరిధిలో రెండ్రోజులుగా పులి జాడలు కలకలం రేపుతున్నాయి.

మెట్‌పల్లి రేంజ్ పరిధిలో పెద్ద పులి కలకలం
X

దిశ‌, మెట్ ప‌ల్లి : గత కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారించిన విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రేంజ్ పరిధిలో రెండ్రోజులుగా పులి జాడలు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుంద్రంగి మండలం మానాల అటవీ ప్రాంతం నుండి నిజామాబాద్‌ జిల్లా బీంగల్ పట్టణ శివారు వైపు పులి వెళ్లినట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు డీఎఫ్‌ఓ రవిప్రసాద్ సూచనల మేరకు ఎఫ్‌ఆర్‌ఓ పద్మారావు ఆధ్వర్యంలో రంగం లోకి దిగి పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు కనిపెట్టి అప్రమత్తమయ్యారు. మెట్‌పల్లి రేంజ్ సిబ్బంది మూడు బృందాలుగా విభజించి గాలింపు చర్యలు చేపట్టగా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం, లోంకరామన్న ఆలయ పరిసరాలతో పాటు రాళ్ల వాగు ప్రాంతంల్లో మెట్‌పల్లి మండలం రంగారావుపేట, పాటిమీదితండా పరిసర ప్రాంతాల్లో పులి పాద ముద్రలను గుర్తించి పాద ముద్రలధారంగా తీసుకుని అది ఎటువైపు వెళ్తుందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నమని ఆయా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరివెంట డిప్యూటీ రేంజ్ అధికారులు అరుణ్‌కుమార్, సురేష్ కుమార్‌తో పాటు బీట్ అధికారులు సాయి, ప్రదీప్, మధు, శ్రావణ్, రఫీ నయీం మరియు బేస్ క్యాంపు సిబ్బంది నవీన్ గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

Next Story