యువతకు స్ఫూర్తి ప్రదాత..!

by Ratna Kumari |

ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని హుజురాబాద్‌కు చెందిన ఒక వృద్ధురాలు చాటి చెప్పారు.

యువతకు స్ఫూర్తి ప్రదాత..!
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని హుజురాబాద్‌కు చెందిన ఒక వృద్ధురాలు చాటి చెప్పారు. హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ పర్వంలో ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన రామ రాజమ్మ (97) అనే వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలనే పట్టుదలతో ఆమె ఆటోలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న స్థానికులు మరియు యువకుల సహాయంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తన ఓటును వేశారు.

సాధారణంగా స్వల్ప అనారోగ్యం లేదా చిన్నపాటి కారణాలతో యువత ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ శతాబ్దానికి చేరువలో ఉన్న రాజమ్మ చూపిన చొరవ అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ఆమెను చూసి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వారు ముక్కున వేలేసుకున్నారు. ​"97 ఏళ్ల వయసులో రాజమ్మ చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే.. ఓటు విలువ ఎంతో అర్థమవుతోంది. యువతీ యువకులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి" అని స్థానికులు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. ​ప్రజా స్వామ్య పండుగలో భాగస్వామ్యం ​ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా వృద్ధురాలి ఉత్సాహాన్ని చూసి ప్రశంసించారు.

Next Story