తోటి స్నేహితునికి 2009 బ్యాచ్ పోలీసుల అండ

by Ratna Kumari |

త‌న తోటి మిత్రుడి అకాల మరణం ఆ బ్యాచ్ సభ్యులను కలిచివేసింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లు.

తోటి స్నేహితునికి 2009 బ్యాచ్ పోలీసుల అండ
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : త‌న తోటి మిత్రుడి అకాల మరణం ఆ బ్యాచ్ సభ్యులను కలిచివేసింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లు. ​రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కంచర్ల గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ ఇటీవల అకాల మరణం చెందారు. దిలీప్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం దిలీప్ నివాసానికి చేరుకున్న ఆయన తోటి బ్యాచ్‌మేట్స్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దిలీప్ పిల్లల చదువుల కోసం ఆ కుటుంబ భవిష్యత్తు కోసం 2009 బ్యాచ్ సభ్యులు సేకరించిన రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ​గంపల సతీష్, గొర్రె తిరుపతి, ఆకుల సతీష్, ముజాల కైలాష్, అనిల్, తీగల మహేష్ పాల్గొన్నారు.

Next Story