- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి సాగు చేస్తున్న ఐదుగురికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10వేల జరిమానా
జగిత్యాల జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురు నిందితులకు జిల్లా సెషన్స్ జడ్జి నారాయణ ఒక్కొక్కరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించారు.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురు నిందితులకు జిల్లా సెషన్స్ జడ్జి నారాయణ ఒక్కొక్కరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించారు. వివరాల్లోకెళ్తే.. ఈ కేసులో శిక్ష పడిన వారిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాయిపూర్ గ్రామానికి చెందిన సోయాం రాజు, జగిత్యాలకు చెందిన బొమ్మిడి సాయి చంద్, ధరూర్‌కు చెందిన పాల రాజ్ కుమార్, బాల నరేష్, కొలుగురి సాయి సృజన్ ఉన్నారు. కేసు వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడైన సోయం రాజు అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో తన పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తూ అవసరమైన వారికి ఫోన్ ద్వారా సంప్రదించి స్వయంగా గంజాయి సరఫరా చేసేవాడు. మిగతా నలుగురు నిందితులు స్నేహితులు చెడు అలవాట్లకు బానిసై గంజాయి వినియోగం చేసేవారు. 2022 డిసెంబర్ 23న నిందితులు గంజాయి కోసం సోయాం రాజును సంప్రదించగా, నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతానికి రావాలని సూచించారు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద సుమారు 1.25 కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో పోలీసులు పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సాక్ష్యాదారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితులకు శిక్షలను ఖరారు చేసింది.






