60 క్వింటాళ్ల అక్రమ PDS రైస్.. పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

by Bhanu |

రాష్ట్ర ప్రభుత్వ పథకంగా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు

60 క్వింటాళ్ల అక్రమ PDS రైస్.. పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాష్ట్ర ప్రభుత్వ పథకంగా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో బినవేని దేవయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్మేందుకు నిల్వ ఉంచినట్టు సమాచారం అందింది.

ఈ మేరకు గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎల్లారెడ్డిపేట పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించి, 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దేవయ్యను అదుపులోకి తీసుకుని, రేషన్ బియ్యాన్ని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం, నిల్వ ఉంచడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ తరహా దందాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి నిరంతరం నిఘా పెట్టి, జిల్లాలో విస్తృత స్థాయిలో దాడులు కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రాజేష్, తిరుపతి, శ్రీనివాస్, శివలు, స్థానిక కానిస్టేబుళ్లు దిలీప్ రావు, హోంగార్డు శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకంగా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో బినవేని దేవయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్మేందుకు నిల్వ ఉంచినట్టు సమాచారం అందింది.

ఈ మేరకు గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎల్లారెడ్డిపేట పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించి, 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దేవయ్యను అదుపులోకి తీసుకుని, రేషన్ బియ్యాన్ని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం, నిల్వ ఉంచడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ తరహా దందాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి నిరంతరం నిఘా పెట్టి, జిల్లాలో విస్తృత స్థాయిలో దాడులు కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రాజేష్, తిరుపతి, శ్రీనివాస్, శివలు, స్థానిక కానిస్టేబుళ్లు దిలీప్ రావు, హోంగార్డు శంకర్ పాల్గొన్నారు.

Next Story