5’S విధానం సమర్థవంతంగా అమలు చేయాలి : ఏసీపీ విజయ్ కుమార్

by Ratna Kumari |

5’S విధానం సమర్థవంతంగా అమలు చేయాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

5’S విధానం సమర్థవంతంగా అమలు చేయాలి : ఏసీపీ విజయ్ కుమార్
X

దిశ, గంగాధర: 5’S విధానం సమర్థవంతంగా అమలు చేయాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. గంగాధర పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం అధికారిక తనిఖీలో భాగంగా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను సమగ్రంగా పరిశీలించిన అధికారులు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌లో అమలులో ఉన్న 5’S విధానం అమలు తీరును పరిశీలించి, దానిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను తనిఖీ చేసి, వాటి సంరక్షణ, రికార్డు నిర్వహణ, కోర్టు కేసులకు సంబంధించిన విధానపరమైన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

2023, 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, డిస్పోజల్ శాతం, దర్యాప్తు పురోగతి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్సై వంశీకృష్ణ, గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story