- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మోకాళ్లపై కూర్చొని, ప్లేట్స్ పట్టుకొని ధర్నా చేశారు.

దిశ, కొత్తపల్లి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మోకాళ్లపై కూర్చొని, ప్లేట్స్ పట్టుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్నారు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ ది అన్నారు. కనీసం విద్యారంగం పై అసెంబ్లీ సమావేశాలలో చర్చ పెట్టే ఎమ్మెల్యే, మంత్రులు చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది అన్నారు. విద్యార్థులకు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలం అయిందని తెలిపారు. విద్యార్థులు స్కాలర్షిప్లు రాక కళాశాలకు వెళ్తే సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వక విద్యార్థులు చదువులను మానేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు మానస సురేష్ సందేశ్ రక్షక్ అక్షయ్, నాయకులు రమేష్, సిరివెన్నెల, సన్నీ, నికిల్ ఆకాష్ పాల్గొన్నారు.






