150 మంది ఈపీ ఆపరేటర్లకు పదోన్నతులు

by Elthuri vijay kumar |

ఖాళీలతో నిమిత్తం లేకుండా ప్రమోషన్లు ఉత్తర్వులు జారీ చేసిన సీఎండీ ఎన్.బలరామ్ నాయక్

150 మంది ఈపీ ఆపరేటర్లకు పదోన్నతులు
X

150 మంది ఈపీ ఆపరేటర్లకు పదోన్నతులు

ఖాళీలతో నిమిత్తం లేకుండా ప్రమోషన్లు

ఉత్తర్వులు జారీ చేసిన సీఎండీ ఎన్.బలరామ్ నాయక్

దిశ, గోదావరిఖని: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-డి నుండి ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి కి, ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి నుండి ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-బి కి త్వరలో పదోన్నతులు ల‌భించ‌నున్నాయి. వీటివ‌ల‌న‌ సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది ఆపరేటర్లు ఈ ప్రమోషన్లు పొంద‌నున్నారు. ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-డి లో రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ఆపరేటర్లకు ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి ప్రమోషన్ ఇవ్వడానికి అలాగే ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి లో మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఆపరేటర్లకు ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-బి కి పదోన్నతులను ఇవ్వటానికి యాజమాన్యం అంగీకరించింది. ఖాళీలతో సంబంధం లేకుండా ఈ ప్రమోషన్లు ఈ ఒక్కసారి మాత్రమే కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు.

ఇటీవల జరిగిన 38వ సీఎండీ స్థాయి, 50వ డైరెక్టర్ (పా) స్థాయి నిర్మాణాత్మక సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం ఇచ్చిన ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈపీ ఆపరేటర్లు ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-డి లో 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రాక్టికల్ పరీక్ష, అసెస్‌మెంట్ నివేదికలో అర్హత సాధించినట్లయితే వారికి ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ–డి నుండి ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి కి ఖాళీల‌ను బ‌ట్టి ప్ర‌మోష‌న్ ల‌ను క‌ల్పిస్తుండేవారు. అలాగే ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి లో 3 సంవత్సరాలు పనిచేసి ప్రాక్టికల్ పరీక్ష మరియు అసెస్‌మెంట్ నివేదికలో అర్హత సాధించినట్లయితే వారికి ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి నుండి ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-బి కు ఖాళీలు ఏర్పడినప్పుడు పదోన్నతులను కల్పించేవారు.

ఈ అంశంపై యాజమాన్యం స్పందించి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వారు ఈ అంశంపై చర్చించి ఒక నివేదికను సమర్పించారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్.బలరామ్ ఈ ఒక్క సారికి ఖాళీలతో సంబంధం లేకుండా కంపెనీ నియమ నిబంధనలను అనుసరించి ప్రమోషన్లు ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. దీని ప్రకారం మార్చి 2025 లేదా సెప్టెంబర్ 2025 నాటికి ఈపీ ఆపరేటర్ ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-డిలో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఈపీ ఆపరేటర్లు అందరికీ ఈపీ ఆపరేటర్ ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఈపీ ఆపరేటర్ ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-సి లో 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఈపీ ఆపరేటర్లంద‌రికీ ఈపీ ఆపరేటర్ ఎక్స్ క‌వేష‌న్ కేట‌గిరీ-బి గా పదోన్నతి కల్పించనున్నారు. అయితే వీరు ప్రాక్టికల్ పరీక్ష, అసెస్‌మెంట్ నివేదికలో అర్హత సాధించవలసి ఉంటుంది.ఈ నిర్ణయం వల్ల సింగరేణి మొత్తం మీద సుమారు 150 మంది ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్లు లభించనున్నాయి.

Next Story