- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు
పట్టణ అభివృద్ధికి రూ.15కోట్లు మంజూరు అయ్యాయి. ఈ తరుణంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి

దిశ, చొప్పదండి: పట్టణ అభివృద్ధికి రూ.15కోట్లు మంజూరు అయ్యాయి. ఈ తరుణంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నిజానపురం చందు ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్ర పటాలకు క్షిరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తురి మహేష్,డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజభూమారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పురం రాజేశం,జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమండ్ల గంగయ్య గౌడ్,ఆత్మ ఛైర్మెన్ గుర్రం రాజేందర్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి గౌడ్, గుర్రం రమేష్ గౌడ్, కట్టెకోల లక్ష్మణ్,గుంటి స్వరూప ఆకుల సురేష్ పాల్గొన్నారు.






