- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
ఈ నెల 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఐడీఓసీలో కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఈ నెల 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఐడీఓసీలో కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని స్కూల్స్, హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్, గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంక్స్, సినిమా హాళ్లు, పరిశ్రమలకు వెళ్లి అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ, అగ్ని ప్రమాదాలు తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. అగ్నిమాపక పరికరాల వినియోగం, మంటలు ఆర్పడం, భవనాల నుంచి ఎలా బయటికి రావడం, పొగ నిండిన గదుల్లో నుంచి బయట పడంపై తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ నరేందర్ సిబ్బంది పాల్గొన్నారు.






