- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ చోరీ.. 13.75 తులాల బంగారం అపహరణ
నాగిరెడ్డిపూర్ గ్రామంలో తాళం వేసిన ఒక ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు.

దిశ, గంగాధర: మండల పరిధిలోని నాగిరెడ్డిపూర్ గ్రామంలో తాళం వేసిన ఒక ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుంకనపల్లి రమేష్ తన మామయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో జాయిన్ అవ్వడంతో, ఆయనను చూసేందుకు ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి ఇళ్లకు తాళం వేసి వెళ్లారు. మూడు రోజుల తర్వాత సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు తిరిగి హైదరాబాద్ నుండి ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్దకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి, తలుపులు దగ్గరకు వేసి ఉండటాన్ని గమనించి రమేష్ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, దొంగలు ఇంట్లోని బీరువాను పగులగొట్టి అందులో భద్రపరిచిన సుమారు 13.75 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించారు.
ఇల్లంతా విస్తృతంగా తనిఖీలు..
బాధితుల ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు తక్షణమే స్పందించి, ఈ భారీ చోరీ సమాచారం అందిన వెంటనే చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కరీంనగర్ నుండి డాగ్ స్క్వాడ్ బృందాన్ని, క్లూస్ టీమ్‌ను రప్పించి ఇల్లంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలంలో దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుడు సుంకనపల్లి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేసినట్లు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.






