100 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

by velandi.Saikiran |

జగిత్యాల జిల్లా కేంద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో భారీసంకల్ప ర్యాలీ నిర్వహించారు

100 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో భారీసంకల్ప ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మీటర్ల పొడువాటి జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జగిత్యాలలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ క్లస్టర్ హెడ్ ఎస్. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవిత బీమా పై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు."దేశభక్తి ఉన్న ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఉండాలి.. కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ జీవిత బీమా తప్పనిసరి"ఉండాలని ఉద్దేశంతోనే ర్యాలీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ మహేష్, సిబ్బంది అడ్వైజర్లు పాల్గొన్నారు.

Next Story