కరీంనగర్ పార్లమెంట్ స్థానం మోడీకి బహుమతిగా అందాలి.. బండి సంజయ్ ప్రత్యేక పూజలు

by Ramesh Goud |

వికసిత్ భారత్ కళ సాకారం అవ్వాలని, కరీంనగర్ పార్లమెంట్ స్థానం మోడీకి బహుమతిగా అందాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ పూజలు చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానం మోడీకి బహుమతిగా అందాలి.. బండి సంజయ్ ప్రత్యేక పూజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికసిత్ భారత్ కళ సాకారం అవ్వాలని, కరీంనగర్ పార్లమెంట్ స్థానం మోడీకి బహుమతిగా అందాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ పూజలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే ముందు మహశక్తి దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ మేరకు బీజేపీ గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికసిత భారత్ కళ సాకారం అవ్వడానికి కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారి సర్కార్ అధికారంలోకి రాబోతున్న తరుణంలో, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ పార్లమెంట్ స్థానం మోదీ గారికి బహుమానంగా అందాలని అమ్మవార్లను వేడుకున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కరీంనగర్ మీ గెలుపు ఖాయం అని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బీజేపీ కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం నుంచి మరో సారి బరిలో ఉన్నారు. ఈయనకు ప్రత్యర్ధులుగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, కాంగ్రెస్ నుండి వెలిచాల రాజేందర్ పోటీలో ఉన్నారు.

Next Story