- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిసెస్ ఇండియా కిరీటం దక్కించుకున్న కరీంనగర్ బిడ్డా
by GSrikanth |
మిసెస్ ఇండియా కిరీటాన్ని హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్గెలుచుకుంది. కేరళ రాష్ర్టం కొచ్చిలో మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో పద్నాలుగు రాష్ర్టాలకు చెందిన అమ్మాయిలను వెనక్కి నెట్టి అంకిత ఈ టైటిల్సాధించటం విశేషం.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మిసెస్ ఇండియా కిరీటాన్ని హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్గెలుచుకుంది. కేరళ రాష్ర్టం కొచ్చిలో మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో పద్నాలుగు రాష్ర్టాలకు చెందిన అమ్మాయిలను వెనక్కి నెట్టి అంకిత ఈ టైటిల్సాధించటం విశేషం. గోదావరిఖనికి చెందిన అంకిత ఠాకూర్కుటుంబం కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్వచ్చి స్థిరపడింది. రష్మిక ఠాకూర్నుంచి శిక్షణ తీసుకుని ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మిసెస్ఇండియా కిరీటాన్ని సాధించటంపై ఎలా స్పందిస్తారు? అని అడిగితే ఈ క్షణాలను జీవితంలో మరిచిపోలేనని అంకిత ఠాకూర్అన్నారు. 1997లో హైదరాబాద్‌కే చెందిన డయానా హెడెన్మిస్వరల్డ్గా నిలిచి మన నగరానికి పేరు తీసుకురాగా ప్రస్తుతం దేశస్థాయిలో మిసెస్ఇండియా కిరీటాన్ని సాధించి అంకిత ఠాకూర్అదే ఘనతను సాధించి పెట్టింది.
Next Story






