- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా అన్వేషణ అంతుచూస్తా.. మరోసారి పోలీసులను ఆశ్రయించిన కరాటే కల్యాణి
టాలీవుడ్ నటి కరాటే కల్యాణి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. యూట్యూబర్ అన్వేష్ పాస్ పోర్టు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత పాస్ పోర్ట్ దరిద్రపుగొట్టు పాస్ పోర్ట్ అని అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి కరాటే కల్యాణి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. యూట్యూబర్ అన్వేష్ పాస్ పోర్టు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత పాస్ పోర్ట్ దరిద్రపుగొట్టు పాస్ పోర్ట్ అని అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో పౌరసత్వం ఎంత ముఖ్యమో పాస్ పోర్ట్ కూడా అంతే ముఖ్యం అని అన్నారు. పాస్ పోర్ట్ గురించి పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగుతుందని దానికి ఎంతో విలువ ఉందని వ్యాఖ్యానించింది. పాస్ పోర్ట్ పై రాజముద్ర ఉంటుందని దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామని అన్నారు.
అలాంటి పాస్ పోర్ట్ ను అన్వేష్ తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు గంటలు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయించారని చెబుతున్నాడని ఆయన ఉడతలు పట్టే ముఖం చూసే వెయిట్ చేయించారని చెప్పింది. అన్వేష్ పాస్ పోర్ట్ రద్దు అయ్యేవరకు తాము పోరాడతమని వార్నింగ్ ఇచ్చింది. పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చామని తెలిపింది. అన్వేష్ భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే అతడి అంతుచూస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే అన్వేష్ తన వీడియోలో ఇండియన్ పాస్ పోర్ట్ చూసి లాటిన్ అమెరికాలో నాలుగు గంటలు వెయిట్ చేయించారని చెప్పాడు. అది దేశం వల్ల కాదని ప్రజలు చేసిన తప్పు వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.






