Allu Arjun : ఆసక్తి రేపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ..అల్లు అర్జున్ మామ కంచర్ల భేటీ!

by Y. Venkata Narasimha Reddy |

టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ను ఆయన నివాసంలో కాంగ్రెస్ నేత(Congress leader), హీరో అల్లు అర్జున్ మామ(Father in Law of actor Allu Arjun) కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancherla Chandrasekhar Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నా(Meets)రు.

Allu Arjun : ఆసక్తి రేపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ..అల్లు అర్జున్ మామ కంచర్ల భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్ : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ను ఆయన నివాసంలో కాంగ్రెస్ నేత(Congress leader), హీరో అల్లు అర్జున్ మామ(Father in Law of actor Allu Arjun) కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancherla Chandrasekhar Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నా(Meets)రు. వారిద్ధరూ ఏ అంశాలపై చర్చించారన్నదానిపై వివరాలు వెల్లడి కాలేదు. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాతా చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు రెండోసారి వెళ్లడం చర్చనీయాంశమైంది.

కాగా ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన లో రేవతి అనే మహిళ మృతి చెందడం..ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడటం..సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై సీరియస్ గా స్పందించడం సంచలనం రేపింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఏ 11గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ కు కాంగ్రెస్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ సాగింది. అదే సయయంలో డిసెంబర్ 24న అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు. ఈ సమయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు.

అయితే ఆమె అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై చర్చించేందుకు నిరాకరించడంతో చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడకుండానే వెనుతిరిగారు. దీనిపై అప్పట్లో స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాంధీభవన్‌లో తమ ప్రెస్‌మీట్‌ జరుగుతుండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడకు వచ్చారని తెలిపారు. ఆయన బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. మళ్లీ వచ్చి తనను కలుస్తానని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్‌ చెప్పారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు, కాంగ్రెస్ వాది అని తెలిపారు. చంద్ర శేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతానని.. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్‌ తెలిపారు. మళ్లీ ఇన్ని రోజులకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చి మహేష్ కుమార్ గౌడ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story