కామారెడ్డి ఎమ్మెల్యే గొప్ప పని.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

by Disha Web Desk 2 |
కామారెడ్డి ఎమ్మెల్యే గొప్ప పని.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రిని, గత ముఖ్యమంత్రిని ఓడించి చరిత్రలో నిలిచిపోయే విక్టరీ సాధించారు. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా ఆరు వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తరచూ వార్తల్లో నిలుస్తు్న్నారు. వినూత్న నిర్ణయాలతో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఆదర్శవంతమైన పనులు చేస్తున్నారు. తాజాగా.. ఆయన చేసిన పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం కామారెడ్డిలో రోడ్ల విస్తరణ పనులపై ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణకు స్వయంగా ఎమ్మెల్యే ఇళ్లే అడ్డుగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా సొంత ఇంటిని దగ్గరుండి మరీ అధికారుల చేత కూల్చివేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవలో నష్టం జరిగినా ముందు తానే భరిస్తానని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ప్రజలను కోరారు.



Next Story

Most Viewed