- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రజలు అత్యుత్సాహం ప్రదర్శించారు’.. వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Katipally Venkata Ramana Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వస్తే బాగుండేదని.. ఇంతటి దారుణాలు చూసేవాళ్లం కాదని అన్నారు. ప్రజా తప్పిందం, ఆక్రమణలే వరదలకు కారణమని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నేతలు ఎవరం ఏమీ చేయలేమని అన్నారు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వరదల సమయంలో నేనేం ఖాళీగా ఇంట్లో కూర్చొని కాలయాపన చేయలేదు.. నేనేం చేశానో వరద బాధితులకు తెలుసు అని అన్నారు. కాగా, తెలంగాణలో అతి భారీ వర్షాలకు జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. పంట పొలాలు చెరువులను తలపించాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వర్షం విధ్వంసం సృష్టించింది.
Next Story






