- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో బతికే నీకు ఆ హక్కు లేదు.. గరికపాటికి కమలానంద భారతి కౌంటర్
ఆంధ్రప్రదేశ్ పేరును 'తెలుగునాడు'గా మార్చాలన్న గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలపై కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ పేరును కేరళంగా మారుస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాజకీయాల్లో హాట్ టాపిక్‍గా మారింది. కేరళ పేరును మార్చినట్లుగానే ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని అలా చేస్తేనే ప్రజల బతకులు మారుతాయంటూ ప్రముఖ ప్రవచనకర్త, అవధాని గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే నష్టమేంటి అంటూ గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కేరళ పేరు మార్పు పక్కన పెడితే ఏపీలో ఈ వ్యవహారం కొత్త రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది.
గరికపాటి ఏమన్నారు?:
అంధ్రప్రదేశ్ అమలాపురంలో ఇటీవల జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గరికపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించారు. కేరళ స్థానంలో కేరళంగా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ స్థానంలో ఆంధ్ర నాడు (AndhraNadu) అని మార్చాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని, కేరళ ప్రజలకున్న రాష్ట్రాభిమానం, భాషాభిమానం మనకు లేదన్నారు. ఈ విషయం చెప్పడానికి తనకు ఎలాంటి మోహమాటం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చేందుకు నాడు ఎన్టీఆర్ నానా యాతన పడ్డారు. ఆయన ఆశయానికి అనుగుణంగా తెలుగునాడు అని మార్చిన నాడు మనకు కచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎలాగో ఆంధ్రప్రదేశ్ అనే పేరు అంతే. ఇందులో తెలుగుదనమే లేదన్నారు. తమిళనాడు మాదిరిగా తెలుగునాడు అని రాష్ట్రం పేరు మార్చుకుంటే తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయని హాట్ కామెంట్స్ చేశారు.
ఎక్కడో బతికేవాళ్ల సలహాలు మాకొద్దు:
గరికపాటి వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన కమలానంద భారతి ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే నష్టమేంటని ప్రశ్నించారు. రామాయణం కాలం నాటి నుంచి ఆంధ్ర అనే పేరు మనుగడలో ఉందని ఆ మూలాలు వదిలేయవద్దన్నారు. తెలంగాణలో సెటిల్ అయిన గరికపాటికి ఏపీ గురించి ఏం అవసరం? బయట రాష్ట్రాల వాళ్లు ఏపీ ప్రజలకు సలహాలు ఇవ్వొద్దన్నారు. ఆంధ్ర మహాభాగవతం, ఆంధ్ర మహాభారతం ఉన్నాయని ఇప్పుడు తెలివి, అధిక ప్రసంగం ఎక్కువైపోయి వాటిని ఇప్పుడు తెలుగు భాగవతం, తెలుగు భారతం అని రాసుకుంటున్నారు. అడిగేవాడు లేకపోవడంతో ఇలా జరుగుతోంది. చరిత్రను మన మూలాలను పక్కన పెట్టి ఆంధ్ర అంటేనే ఉచ్చరించకూడదని పదంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ రకమైన ఆలోచనలు గరికపాటికి ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. అప్పుడప్పుడు సంక్రాంతి, వేసవి సెలవులకు ఏపీకి వచ్చే మీకు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఎలా ఉండాలో చెప్పే నైతిక బాధ్యత మీకు లేదన్నారు. ఆంధ్రాభిమానంతో బతుకుతున్న మా అభిష్టం, మా నమ్మకాలు మా సెంటిమెంట్‍తో పని లేకుండా ఏడాదికోసారి ఇటువైపు వచ్చి ఇది ఆంధ్రకాదు తెలుగు నాడు అంటే నమ్మే అమాయకులం మేము కాదన్నారు. ఈ రాష్ట్రం, మా బతుకులు ఎలా ఉండాలో చెప్పొద్దన్నారు. మమ్మల్ని ఈడ్చి అవతల విసిరేశాక మా బతుకు మేము బతుకుతున్నాం. ఇక్కడ మేము బతకలేము అని ఎక్కడో బతికేవాళ్లు ఇక్కడికొచ్చి సలహాలు ఇవ్వొద్దన్నారు. ఇలాంటి వాదనలతో విచ్ఛిన్నం తేవొద్దని మేము ఆంధ్రులం ఆంధ్రప్రదేశ్ గానే ఉంటామన్నారు.






