రాజ్యసభకు కమల్‌హాసన్ నామినేషన్ దాఖలు.. హాజరైన సీఎం స్టాలిన్

by Kema Shiva Kumar |

తమిళనాడు (Tamilnadu) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు ఎన్నికైన అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎన్.చంద్రశేఖరన్ (ఏఐఏడీఎంకే), ఎం.షణ్ముగం, మహ్మద్ అబ్దుల్లా, విల్సన్, వైకోల పదవీ కాలం జూన్ 24‌తో ముగియనుంది.

రాజ్యసభకు కమల్‌హాసన్ నామినేషన్ దాఖలు.. హాజరైన సీఎం స్టాలిన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు ఎన్నికైన అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎన్.చంద్రశేఖరన్ (ఏఐఏడీఎంకే), ఎం.షణ్ముగం, మహ్మద్ అబ్దుల్లా, విల్సన్, వైకోల పదవీ కాలం జూన్ 24‌తో ముగియనుంది. దీంతో ఖాళీ అయిన స్థానాలకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 19న ఎన్నికకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే డీఎంకే (DMK) తరఫున పి.విల్సన్‌, ఎస్.ఆర్.శివలింగం, కవయిత్రి సల్మాతో పాటు మిత్రపక్షమైన మక్కల్ నీది మయ్యం నుంచి ఆ పార్టీ చీఫ్ కమల్‌హాసన్‌ (Kamal Haasan)తో కలిపి నలుగురు రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆ నలుగురు అభ్యర్థులు ఇవాళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.

Next Story