యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి ఓయూ సందర్శన వేళ తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ లో జాబ్ క్యాలెండ‌ర్ అంశంపై ప్ర‌శ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఆశపెట్టి గద్దెనెక్కార‌ని అన్నారు.

యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఓయూ సందర్శన వేళ తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ లో జాబ్ క్యాలెండ‌ర్ అంశంపై ప్ర‌శ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఆశపెట్టి గద్దెనెక్కార‌ని అన్నారు. రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావ్.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావ్? అని ప్ర‌శ్నించారు. మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? అని ప్ర‌శ్నించారు. ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ తో ఇన్నాళ్లు మభ్య పెట్టి ఇప్పుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడుతున్నార‌ని పేర్కొన్నారు.

పోరాటాల పురిటి గడ్డ అది.. మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం చేశానని చెప్తార‌ని ప్ర‌శ్నించారు. ఉత్తుత్తి మాటలు.. జాబ్ లెస్ క్యాలెండర్ లకు కాలం చెల్లిందని అన్నారు. రైజింగ్ పేరుతో అబద్ధాల వల్లెవేత కాదు.. యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత క‌విత అటు గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా పోస్టులు, మీడియా స‌మావేశాల‌తో త‌ర‌చూ వార్తల్లో నిలుస్తున్నారు. మ‌రోవైపు జాగృతి జ‌నంబాట కార్య‌క్ర‌మంతోనూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు.

Next Story