ఓడిపోయినా పదవులు.. అధికారం పోతే విమర్శలు.. అంతేనా అక్కా.. కవిత సంచలన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

దీక్షా దివస్, విజయ్ దివస్‌లు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఓడిపోయినా పదవులు.. అధికారం పోతే విమర్శలు.. అంతేనా అక్కా.. కవిత సంచలన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నవంబర్ 29న దీక్షా దివస్, డిసెంబర్ 9వ తేదీన విజయ్ దివస్‌లు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్ చేశారు. మంగళవారం ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు.. విజయ్ దివస్‌లు.. ఇది ఉద్యమాల గడ్డ

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రేణులు కవిత పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గతంలో దీక్షా దివస్, విజయ్ దివస్‌లలో మాట్లాడిన వీడయోలు, గతంలో చేసిన ట్వీట్‌లను పోస్ట్ చేస్తూ ఆమెకు గుర్తుకు చేశారు. అధికారం ఉన్నప్పుడు BRS పార్టీ మంచిది.. అధికారం లేకపోతే చెడ్డది.. అంతేనా అక్కా అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించారు.

BRS పదేళ్లలో దీక్షా దివస్ మరిచిపోయి ఉంటే.. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అబ్బా ? అని గతంలో కవిత మాట్లాడిన వీడియో పోస్ట్ చేశారు. ‘అధికారం ఉన్నప్పుడు అన్ని అనుభవించడం, అధికారం పోయాక నిందించడం, ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని మరో నెటిజన్ విమర్శిస్తూ కామెంట్ పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయినా పదవులు అనుభవిస్తాం.. అధికారం పోతే విమర్శిస్తాం.. అని మరో నెటిజన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్వీట్ ఇదే..

Next Story