హరీష్ రావు ఒక 'గుంట నక్క'.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు: కల్వకుంట్ల కవిత

by Malleboina Mahesh |   (  Updated:2026-01-04 14:30:28  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

హరీష్ రావు ఒక గుంట నక్క.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు: కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao)పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె, హరీష్ రావును "గుంటనక్క" అని విమర్శలు గుప్పించారు. కీలకమైన మూసీ ప్రక్షాళన, నదీ జలాల అంశంపై సభలో చర్చ జరుగుతుంటే, ప్రతిపక్షం అక్కడ ఉండకుండా పారిపోవడం ప్రజలను వంచించడమేనని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావును వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నంత మాత్రాన సభను బహిష్కరిస్తారా? అని కవిత ప్రశ్నించారు. "గతంలో కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఎన్ని తిట్లు తిట్టలేదు? అప్పుడు ఎందుకు బాయ్‌కాట్ చేయలేదు? ఇప్పుడు హరీష్ రావుకు ఒక పదవి (డిప్యూటీ ఫ్లోర్ లీడర్) రాగానే ఇలా ప్రవర్తిస్తారా?" అని ఆమె నిలదీశారు.

ప్రతిపక్షం అంటే కేవలం ఒక పార్టీ కాదని, అది ప్రజల గొంతుకని, ఆ గొంతుకను సభలో వినిపించకుండా బయట నిరసనలు తెలపడం వల్ల ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆందోళన పార్టీలో హరీష్ రావు ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చేస్తున్నారని, ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవని కవిత ఆరోపించారు. "హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినప్పుడే చెప్పాను.. ఇకపై బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని. కేసీఆర్ గారు సభకు వచ్చి సమాధానం చెప్పకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు నిర్ణయాల వల్ల ప్రాజెక్టులకు నష్టం జరిగిందని, తన తండ్రిని బలిపశువును చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించడం పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది.

READ MORE ....

బీఆర్ఎస్‌లో హరీష్ రావుకు సపరేట్ గ్రూప్: Kalvakuntla Kavitha

Next Story