ముందు బీఆర్ఎస్‌నే టార్గెట్ చేశా.. కొందరు మాజీ ఎమ్మెల్యేలు నన్ను కలిశారు: బాంబ్ పేల్చిన కవిత

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్‌గా మారారు.

ముందు బీఆర్ఎస్‌నే టార్గెట్ చేశా.. కొందరు మాజీ ఎమ్మెల్యేలు నన్ను కలిశారు: బాంబ్ పేల్చిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్‌గా మారారు. మాజీ మంత్రి కేటీఆర్ చేపట్టనున్న పాదయాత్రపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమెను మారోజు వీరన్న అనుచరులు కలిశారు. అనంతరం వారితో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి, ఇప్పుడు ఒక్కసారిగా జ్ఞానోదయమై పాదయాత్రలు గుర్తొచ్చాయా? అని ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజలపై ప్రేమతో ఈ యాత్రలు చేయడం లేదని, అధికారాన్ని కోల్పోయామన్న ఆవేదనతోనే ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. హరీష్ రావుది అంతా కుట్రా రాజకీయం. ఆయన్ను నేను ఎప్పటికీ నమ్మను. పార్టీలో గ్రూపు రాజకీయాలు పెంచి పోషించింది ఆయనే అని ఆమె ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనను కలిసి లోగుట్టు విప్పారని, అయితే వారి పేర్లు ఇప్పుడు బయటపెట్టనని స్పష్టం చేశారు.

నా లక్ష్యం 'సర్వోదయ తెలంగాణ'..

తన రాజకీయ భవిష్యత్తు, ప్రస్తుత వ్యూహంపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. "మొదట్లో నేను బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాను, అందుకే నన్ను పంపించేశారు. కానీ సమస్యలు పరిష్కరించాల్సింది అధికార పార్టీ కాబట్టి, ఇప్పుడు నా లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం" అని పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం ఒకే వర్గం లేదా ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉండకూడదని, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. 'సర్వోదయ తెలంగాణ' పేరుతో సరికొత్త రాజకీయ పంథాలో ముందుకు వెళ్తానని ఆమె ప్రకటించారు.

Next Story