సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తా.. కవిత ప్రకటన

by Gantepaka Srikanth |

ఆంధ్రోళ్లు వందల ఆంక్షలు పెట్టినా బుల్లెట్లకు ఎదురు పోయి ఉద్యమం చేసి చరిత్ర తనదని.. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఆగేదీ లేదని.. కచ్చితంగా చింతమడకకు సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తానని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.

సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తా.. కవిత ప్రకటన
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఆంధ్రోళ్లు వందల ఆంక్షలు పెట్టినా బుల్లెట్లకు ఎదురు పోయి ఉద్యమం చేసి చరిత్ర తనదని.. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఆగేదీ లేదని.. కచ్చితంగా చింతమడకకు సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సిద్దిపేట జిల్లా చింత మడక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ప్రారంభ తర్వాత కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తే ఇంకొకరిని ఇక్కడ పెట్టారన్నారు. అనాటి నుంచి సిద్దిపేట, చింత మడక రావాలంటే ప్రైవేట్ ప్రాపర్టీ మాదిరి ఆంక్షలు పెడుతున్నారన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆకాంక్షలు పెట్టారన్నారు. ఏ ఊరు కూడా ఎవరీ అయ్య జాగీరు కాదు.. చిరుతపులి కేసీఆర్‌ను కన్న చింతమడక గడ్డ మీద ఎవరీ ఆంక్షలు నై జాన్తా అని ఊరంతా నిరూపించింది అన్నారు. చింత మడక ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. మీరు ఆశీర్వాదం ఇస్తే నా జన్మభూమి కూడా కర్మభూమి కావచ్చు అన్నారు.

తల్లీని బిడ్డను పాపిండ్రు...

చంద్రుడి లాంటి కేసీఆర్‌కు కొంత మంది మచ్చ తెచ్చే పని చేశారని చెప్పగానే కుట్రలు పన్ని తల్లిని పిల్లను కాకుండా పాపిన్రు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వానికి గురైయ్యారు. కుటుంబానికి దూరం చేశారని బాధలో ఉన్న సమయంలో ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని పిలిచి చింతమడక గ్రామస్తులు ఆండా నిలిచారన్నారు. తల్లి తండ్రి బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబానికి దూరం చేసే కుట్ర చేసిన వాళ్లను వదిలి పెట్ట అన్నారు. చింతమడక గడ్డ పౌరుషం చూపి వాళ్ల భరతం ఖచ్చితంగా పడతానని హెచ్చరించారు.

కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం

ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చింతమడక గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చింతమడక కు చేరుకున్న కల్వకుంట్ల కవితను మహిళలు, గ్రామస్తులు ఆప్యాయంగా పలుకరించారు. గ్రామస్తులను ఎమ్మెల్సీ కవిత ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శివాలయంలో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాదిగ సంఘం చింతకమడక గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో కల్వకుంట్ల కవిత బతుకమ్మ పేర్చారు. రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం హై స్కూల్ గ్రౌండ్ లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పెద్ద చెరువులో బతుకమ్మ నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కసి రెడ్డి సురేశ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్, నాయకులు మల్లుపల్లి పోచయ్య, ఆకుల రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story