- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అలా చేస్తే ఊరుకోం.. స్తంభింపచేస్తాం’: రేవంత్ సర్కార్‌కు కవిత హెచ్చరిక
గ్రూప్ - 1 నియామకాల్లో సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్ - 1 నియామకాల్లో సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా... వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది అంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో స్పష్టమవుతోంది. దీనినే సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల(Group-1 Job Recruitment) వివాదం న్యాయ స్థానాల్లో తేలేవరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దని అన్నారు.
గ్రూప్ -1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అనేక తప్పులు చేసింది.. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తుంగలో తొక్కింది.. న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను స్తంభింపజేస్తామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ట్వీట్






