బలిదానాలు చేయకండి.. సాయి ఈశ్వర్ మృతిపై కవిత ట్వీట్

by Gantepaka Srikanth |

బలిదానాలు చేయకండి.. సాయి ఈశ్వర్ మృతిపై కవిత ట్వీట్

బలిదానాలు చేయకండి.. సాయి ఈశ్వర్ మృతిపై కవిత ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ బిల్లు కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి ఈశ్వర్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందతూ.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. సాయి ఈశ్వర్‌‌ మృతిపై తెలంగాణ జగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలచి వేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారు. సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య పోరాటాలు చేద్దాం.. బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు’ అని కవిత పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ చారికి మద్దతుగా ఉదయం నుంచి గాంధీ ఆస్పత్రి వద్ద వందలాదిమంది మంది సంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Next Story