- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత.. MP సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీపై విమర్శలు చేయడం, పరోక్షంగా మీరు ఫెయిల్ అయ్యారని తండ్రిని నిందిస్తూ లేఖ రాయడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునేందు మరోసారి పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని.. లేకపోతే ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లిన ప్రచారం నిజమని నమ్మడం ఖాయమని లేఖలో పేర్కొన్నారు. అయితే.. కవిత లేఖపై అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావు గానీ స్పందించలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కేడర్‌లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్(Telangana Congress), బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అని సందేహం వారిలో కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.
తెలుగు రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత మరో షర్మిల కాబోతుందని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్‌తో పాటు హరీష్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కవిత కూడా మరో షర్మిల అవుతుందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయని అన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లిన కొన్నిరోజులకే.. టీపీసీసీ చీఫ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అయితే.. రఘునందన్ రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి వదిలిన బాణమే కవిత.. వచ్చే ఎన్నికల నాటికి పీసీసీ చీఫ్ కాబోతోంది
— Telugu360 (@Telugu360) May 23, 2025
ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు pic.twitter.com/Qvf6w2kLn7






