- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ పండుగపూట కన్నీరు పెట్టిన కవిత.. ‘మీ భరతం పడతా’ అని వారికి స్ట్రాంగ్ వార్నింగ్
బతుకమ్మ పండుగపూట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) భావోద్వేగానికి గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బతుకమ్మ పండుగపూట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చింతమడక(Chintamadaka)లో నిర్వహిస్తున్న ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రుడి లాంటి కేసీఆర్(KCR)కు మచ్చ తెచ్చారు. నన్ను నా కుటుంబానికి దూరం చేశారు. సిద్దిపేట వారి జాగీర్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కూడా వారి కేజీఎఫ్‌లోకి వస్తున్నట్లు ఆంక్షలు పెట్టారు. సిద్దిపేట ఎవరి జాగీర్ కాదు. ఇక్కడ ఎవరి ఆంక్షలు పనిచేయవు. నా కుటుంబానికి ఈ పరిస్థితులు తీసుకొచ్చిన ఎవరినీ వదలను. ఒక్కొక్కరి భరతం పడతా. చింతమడక పౌరుషం ఎలా ఉంటుందో వారికి తప్పకుండా చూపిస్తా’ అని పరోక్షంగా హరీష్ రావుకు కుల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘చింతమడకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఈ సంవత్సరం నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కుటుంబానికి దూరం అయ్యాను. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పార్టీ నుంచి బయటకు పంపించారు. పదవి వదులు కోవాల్సి వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నన్ను ఇంత ఆదరిస్తున్న చింతమడక ప్రజలకు ధన్యవాదాలు. గతంలో చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రమంతా తిరిగా. చింతమడక ప్రజల మేలు ఈ జన్మలో మరిచిపోలేను. సంతోషంలో ఉంటే ఎవరైనా పిలుస్తారు.. మీరు నన్ను దు:ఖంలో ఉన్న సమయంలో పిలిచారు. మిమ్మల్ని ఎప్పుటికీ మరువను’ అని కవిత భావోద్వేగానికి గురయ్యారు.






