కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం.. కేసీఆర్ ఫొటో లేకుండా తెలంగాణ వ్యాప్తంగా యాత్ర

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-14 11:21:57  IST  )

తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం.. కేసీఆర్ ఫొటో లేకుండా తెలంగాణ వ్యాప్తంగా యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌ చివరివారంలో యాత్ర ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. మాజీ సీఎం, స్వయానా తండ్రి కేసీఆర్‌ ఫొటో లేకుండా యాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ ఫొటోతో యాత్ర పోస్టర్లు డిజైన్ చేయాలని జాగృతి శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ మేధావులు, విద్యావంతులతో ఇటీవల కవిత వరుసగా భేటీలు అవుతున్నారు. రేపు(బుధవారం) యాత్ర పోస్టర్‌ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం, బీసీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తామని తెలిపారు. బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని స్పష్టం చేశారు.

Next Story