- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టినా మీ కళ్లు చల్లబడలేదా? కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తన భర్త అనిల్ పేరు ఎన్నడూ ఎవరూ వినపడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ రోజు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తన భర్త అనిల్ పేరు ఎన్నడూ ఎవరూ వినపడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ రోజు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంటి అల్లుడిపై ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. పార్టీ నుండి వెళ్లొగొట్టినా మీ కళ్లు చల్లబడటంలేదారా? అంటూ ఎమోషనల్ అయ్యారు. ఢిల్లీలో తాను కొట్లాడుతుంటే ఏసీ గదిలో ఉంటూ కేసీఆర్ చాటున ప్రజల సొమ్ము పందికొక్కులా తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరవీరుల కోసం బీఆర్ఎస్ లో ఉండి కొట్లాడలేకపోయానని ప్రజలకు క్షమాపణలు చెప్పానని అన్నారు. తాను బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడంలేదని తనను కొడితే ఊరుకోనని అన్నారు. తప్పులేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చివాగుడు వాగితే ఊరుకునేది లేదన్నారు. తాను బయపడేది లేదని స్పష్టం చేశారు. ఐదేళ్లు తనను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. ఎంపీ టికెట్ అడిగితే ఇవ్వలేదని ఎమ్మెల్సీని చేసి పక్కన పెట్టారని అన్నారు. తనను ఎవరైనా కలిసేందుకు వచ్చినా వారిని బెదిరించేవారని వ్యాఖ్యానించారు.






