- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
kavitha: కవిత ఎపిసోడ్‍లో కీలక పరిణామం.. హర్యానా ప్రాంతీయ పార్టీ వేదికపై కవిత ప్రత్యక్షం
హర్యానా వేదికగా కవిత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాంతీయ పార్టీలకే ప్రాంతాలపై ప్రేమ ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నా అవి హర్యానా ప్రజలకు చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఇవాళ హర్యానాలోని రోహ్తక్‍లో జరిగిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‍డీ) పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ 112వ జయంతి వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. ఈ దేశంలో, హర్యానాలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఐఎన్ఎల్‍డీ అధికారంలోకి రాబోతున్నదనే విశ్వాసం తనకు ఉందన్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే విద్యుత్‍పై తీవ్ర భారం మోపే ప్రయత్నం చేస్తోందని అదే తెలంగాణలో కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వస్తే హర్యానా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఐఎన్ఎల్‍డీ చీఫ్ అభయ్ సింగ్ చౌతాలా రైతులకు హామీ ఇవ్వాలని వేదికపైనుంచే సూచించారు.
కవిత రాజకీయ వ్యూహంపై చర్చ :
బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత రాజకీయ భవిష్యత్‍పై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కవిత హర్యానాలో ప్రాంతీయ పార్టీ ఐఎన్ఎల్‍డీ కార్యక్రమంలో పాల్గొడనం ఆసక్తిగా మారింది. ఈ సమావేశానికి కవిత హాజరు కావడం వెనుక భవిష్యత్ వ్యూహం ఏదైనా ఉందా చర్చ జరుగుతోంది. హర్యానా గడ్డపై బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను టార్గెట్ చేసిన ఆమె ప్రాంతీయ పార్టీల పట్ల సానుకూలత ప్రకటించారు. ఈ నేపథ్యంలో కవిత పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.






