- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10th క్లాస్ పాస్ కాలేదనే సాకుతో ఆపడం కరెక్ట్ కాదు: కవిత
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని, దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని, దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌ను కలిసి పలు సమస్యలపై మెమోరాండం ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. అలియాస్ పేర్లతో ఉద్యోగంలో చేరిన నలుగురు కార్మికులను డిస్మిస్ చేయడం దారుణమని.. వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరారు. మెడికల్ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం రీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే గతంలో మాదిరిగా నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. పదో తరగతి పాస్ కాలేదనే సాకుతో పెండింగులో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని.. ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలని.. పరీక్షకు సిద్ధం అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని అన్నారు. సీజీహెచ్ఎస్ పాలసీ అమలు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇచ్చారని తెలిపారు.






