రైతుల ఇబ్బందులు సీఎం పట్టించుకోవటం లేదు: కల్వకుంట్ల కవిత

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనకపోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

రైతుల ఇబ్బందులు సీఎం పట్టించుకోవటం లేదు: కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనకపోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే బాధనిపిస్తోందని, ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, తరుగు తీయవద్దని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల చనిపోతుంటే ఆవేదన కలుగుతోందని చెప్పారు. సచివాలయం వద్ద వడ్లు పోసి నిరసన తెలిపితేనైనా ఈ ప్రభుత్వానికి బుద్ది వస్తుందని ధర్నా చేపట్టామన్నారు.

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వరి, జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దుఖం మామాలుగా లేదన్నారు. రెండున్నరేళ్లుగా ఈ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయలేదని విమర్శించారు. జిల్లాల్లో కలెక్టర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రేడ్ ఏ వరిని గ్రేడ్ లెస్ గా రిజిస్టర్ చేస్తున్నారని, సన్నబియ్యానికి ఇచ్చే బోనస్ ఎగ్గొట్టేందుకే డ్రామాలు చేస్తున్నారని అన్నారు. యూరియకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, వాళ్లు తెచ్చిన యాప్ ఎవరికీ అర్థం కావటం లేదని విమర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story