- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
32 లక్షల మంది ఉన్న మల్కాజిగిరిలో ప్రైవేట్ హాస్పిటల్స్ దే రాజ్యం: కల్వకుంట్ల కవిత
32 లక్షల మంది ఉన్న మల్కాజిగిరిలో ఒక్క వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: 32 లక్షల మంది ఉన్న మల్కాజిగిరిలో ఒక్క వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ పక్కనే ఉన్న మల్కాజ్ గిరి జిల్లాలో 32 లక్షల మంది ఉన్నారని కానీ ఒక్క ఆస్పత్రి కూడా లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు రాజ్యం ఏలుతున్నాయని అన్నారు. ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, కొన్ని సబ్ సెంటర్లు ఉన్నాయని అన్నారు. కానీ వందపడకల ఆస్పత్రి ఒక్కటి కూడా లేదని అన్నారు.
దీంతో ప్రజలంతా ప్రైవేటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. సర్జరీలు అయితే గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారని చెప్పారు. జవహర్ నగర్, కేబీహెచ్ బీ ప్రాంతాల నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. కీసర లోనూ అదే పరిస్థితి కనిపిస్తుందని విమర్శించారు. గర్భిణీలు చాలా దూరం నుండి వచ్చేవారు గంట, రెండు గంటలు ప్రయాణం చేయాలంటే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఎక్కువగా ఉన్నారని కానీ ఆస్పత్రి లేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.






