- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో కవిత చాయ్ పే చర్చ.. నిరుద్యోగులకు కీలక భరోసా
కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత చాయ్ పే చర్చ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చాయ్ పే చర్చ చేశారు. శనివారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చాయ్ తాగి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి కల్వకుంట్ల కవిత చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పందిస్తూ.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామంటే నమ్మి మోసపోయామని పేర్కొన్నారు. నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ల ప్రక్రియ పూర్తి చేసి అవన్నీ తాము ఇచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటుందన్నారు.
నిరుద్యోగుల సమస్యలతో పాటు జోనల్ వ్యవస్థ అంశాలపై పోరాడాలని కవితకి సూచించారు. రాష్ట్రంలో మళ్లీ అధికార మార్పిడి జరిగితేనే నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తుందని పలువురు విద్యార్థులు అన్నారు. కవిత రాజకీయాల్లోకి రావాలని.. వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని కవిత ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానని.. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.






