- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్‌బెల్ట్‌లో కవిత ‘బాయిబాట’.. ఐదు నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్ధం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ నెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ నెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. బాయిబాట పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో కవిత సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటించనున్నారు. 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలో గల బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్‌జీ 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్‌జీ 2 ఏరియా, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్‌జీ 3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో సమావేశమవుతారు.






