- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్టీ నేత.. ప్రకటించిన కల్వకుంట్ల కవిత
దసరా పండుగను పురస్కరించుకోని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రెండోకమిటీని ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగను పురస్కరించుకోని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రెండోకమిటీని ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాపపర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్న కవిత గురువారం రాత్రి అనూహ్యంగా రాష్ట్ర కమిటీ రెండో జాబితాను ఎనౌన్స్ చేశారు. కవిత సామాజిక కోణంలో రాష్ట్ర కమిటీని కూర్పు చేసినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. విజయ దశమి సందర్భంగా ప్రకటించిన రెండో జాబితాలో గిరిజన నేత లకావత్ రూప్ సింగ్ నాయక్ ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి సంచలనం సృష్టించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తోపాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర అనుబంధ విభాగాలను ప్రకటించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని కవిత పేర్కొన్నారు. జాగృతిలో కొత్త బాధ్యతలు అప్పగించిన వారు సంస్థ ఆశయాలకు అంకితమై పని చేయాలని కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు.
ఇక సామాజిక తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గంలో 80 శాతానికిపైగా పదవులను బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న కవిత.. ఆ సందర్భంగా జిల్లాల్లో మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం కానున్నారు. ప్రజలతో పాటు ఆయా రంగాల ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు త్వరలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం మూడో విడత ప్రకటన చేయనున్నారు.
నూతన కార్యవర్గ నియామకాలు
అధ్యక్షులు - కల్వకుంట్ల కవిత
కార్య నిర్వాహక అధ్యక్షుడు - లకావత్ రూప్ సింగ్
ఉపాధ్యక్షులు : రియాజుద్దీన్
మంచాల వరలక్ష్మి
పుస్కూరి శ్రీకాంత్ రావు
కొట్టాల యాదగిరి
కోల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి - రంగు నవీన్ ఆచారి
రాష్ట్ర కార్యదర్శులు - జాడి శ్రీనివాస్
గుంటి సుందర్
సేనాపతి అర్చన
తెలంగాణ జాగృతి రాష్ట్ర అనుబంధ విభాగాలు
జాగృతి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు - జూపల్లి శ్రీనివాస్
జాగృతి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు - వెంకటరమణ మూర్తి
బంజారా జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు - కేతావత్ రవీందర్ నాయక్
యువ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - షేక్ హుస్సేన్
యువ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు - నవీన్ గోగికార్
జాగృతి ఎంబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - హాకింకర్ సురేందర్
జాగృతి ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు - బొడ్డుపల్లి కోటేశ్వర చారి
జాగృతి బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు - రుద్రారం శ్రీనివాస్ రజక
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు
రంగారెడ్డి - కప్పటి పాండురంగ రెడ్డి
హైదరాబాద్ - బండారి మహేందర్ ముదిరాజ్
వికారాబాద్ - కుమ్మరి శ్రీనివాస్
ఖమ్మం- గట్టు కరుణ
కొత్తగూడెం - దేవెళ్ల వీరన్న
కరీంనగర్ గుంజపడుగు హరి ప్రసాద్
సూర్యాపేట ఉపాధ్యక్షురాలు - నీల ఉమారాణి
సూర్యాపేట ప్రధాన కార్యదర్శి - గోవర్ధన్ ప్రజాపతి
సూర్యాపేట యువ జాగృతి అధ్యక్షుడు- వీరగాని సాయి చందన్ గౌడ్
సంగారెడ్డి - మహమ్మద్ జకీర్
జాగృతి నియోజకవర్గ బాధ్యులు
మహేశ్వరం - అడుగుల సత్యనారాయణ
చార్మినార్ - రాధాక్రిష్ణ పుప్పల
కార్వాన్ - కావూరి వెంకటేష్
ఉప్పల్ - గోపు సదానందం
సూర్యాపేట - నలబోలు సైదిరెడ్డి
మహిళా జాగృతి జిల్లా అధ్యక్షులు
1.పిట్టల శ్యామల - యాదాద్రి భువనగిరి
2. హారిక రావు - పెద్దపల్లి
3. మంజులరావు - హనుమకొండ
4. నూకల రాణి- వరంగల్
5. అంకంశివరాణి - కరీంనగర్
6. దోనకొండ సుజాత - జగిత్యాల
7.బండారిలావణ్య - రంగారెడ్డి
8. చిలుక మంజుల రెడ్డి - నాగర్ కర్నూలు
9. తినేటి సంధ్యారెడ్డి - మేడ్చల్
ఆటో జాగృతి జిల్లా అధ్యక్షులు
1. మంచిర్యాల- వంగ సాయి కుమార్ యాదవ్
2. నిజామాబాద్- బి శ్రీనివాస్
3. కామారెడ్డి - ఎమ్ డి అల్తాఫ్
4. కరీంనగర్- ఎన్ నర్సింహా నాయక్
5. సిరిసిల్ల- వీరబత్తిని రమేష్
6. వరంగల్- కేతిరి సంతోష్ కుమార్
7. హన్మకొండ- గుగులోత్ దేవేందర్ నాయక్
8. మహబూబాబాద్- బి కళ్యాణ్ నాయక్
9. కొత్తగూడెం- నొకుర్తి రాంబాబు
10. ఖమ్మం- బోడ శ్రీను నాయక్
11. నల్గొండ- పులిజాల వెంకన్న
12. సూర్యాపేట- ఎమ్ డి ఆఖీల్
13. యాదాద్రి భువనగిరి- తునికి భాను ముదిరాజు
14. సిద్దిపేట్- జి సురేష్
15. రంగారెడ్డి- వి బాలాజీ నాయక్
16. మేడ్చల్ మల్కాజ్ గిరి- కట్రావత్ మున్నా
17. నారాయణపేట- ఎన్ శ్రీనివాస్






