బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్! కవిత తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగ రేటు పెరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన చెందారు.

బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్! కవిత తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగ రేటు పెరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన చెందారు. నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత శనివారం ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. చాలా మంది గ్రామీణ స్థాయి యువత హైదరాబాద్‌లో ఉంటూ కోచింగ్ తీసుకున్నారని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు తప్పితే వారి పరిస్థితి మారలేదన్నారు. దీంతో కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతదని బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో ఓడించారని వివరించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తదని అనుకున్నారు.. కానీ అది కూడా ఇవ్వలేదన్నారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉండి అన్యాయం చేసిన నాయకులంతా కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. ఈ పాలిటిక్స్‌ని యూత్ గమనించాలని సూచించారు.

బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టులు

బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతోందని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో దొడ్డిదారిన అక్రమ నియామకాలు.. లక్షలాది మంది నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు, యువత నోట్లో ప్రభుత్వం మట్టి కొడుతోందని మండిపడ్డారు.

Next Story