ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే.. కవిత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

ట్రిపుల్ ఆర్ భూ సేకరణలో అక్రమాలు జరిగాయని, అందుకే ట్రిపుల్ ఆర్ రీ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే.. కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రిపుల్ ఆర్ భూ సేకరణలో అక్రమాలు జరిగాయని, అందుకే ట్రిపుల్ ఆర్ రీ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వాషింగ్ పౌడర్ నిర్మా రాజకీయాలు మనకెందుకు అని, కబ్జాలు చేసినోళ్లే ఫిరాయింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో చెరువులు ఎమ్మెల్యేలే కబ్జా పెడితే హైడ్రా నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? అని నిలదీశారు. కబ్జాల వివరాలన్నీ హైడ్రాకు ఇస్తాం.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాం.. అని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కబ్జాల గురించి మేము మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో వెళ్లేందుకు చర్చలు చేస్తున్నారంట.. అని ఆరోపించారు.

కబ్జాలు చేసే వాళ్లు కాంగ్రెస్‌లో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్లుగా క్లీన్ అయిపోతున్నారా? అని కవిత ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లను సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ నేతల కోసం మార్చుతున్నారని ఆరోపించారు. సామాన్య రైతులకు అన్యాయం చేస్తున్నారు. వారందరితో నితిన్ గడ్కరీని కలుస్తా.. అని చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జాగృతి పని చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా పోరాటం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తాం అని వెల్లడించారు.

పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటున్న కాంగ్రెస్ కచ్చితంగా బీసీ వ్యతిరేక ప్రభుత్వమేనని అన్నారు. జాగృతి జనం బాట స్టార్టింగ్ పాయింట్ మాత్రమే.. మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. మా పర్యటనలో భాగంగా రంగారెడ్డి పదో జిల్లా.. హైదరాబాద్‌కు కంఠహారం మాదిరిగా ఉండే జిల్లా అని చెప్పారు. పేరుకేమో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లా, కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం సరై ఫలాలు అందలేదని, అసలైన రంగారెడ్డి వాసికి ఏమాత్రం ప్రయోజనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story