సింగరేణి కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కవిత తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

మరోసారి కార్మికులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

సింగరేణి కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కవిత తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి కార్మికులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. 2024-25 సంవత్సరానికి 69.01 ఎంటీ బొగ్గు ఉత్పత్తి చేయడంతో సింగరేణికి రూ.6 వేల కోట్ల నికర లాభాలు వస్తాయని చెప్పారన్నారు. (Singareni workers) సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ లెక్కన సింగరేణి కార్మికులకు లాభాల (Bonus) బోనస్ రూపంలో రూ. 2,040 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏవేవో సాకులు చెప్పి కార్మికులకు ఇచ్చే లాభాల బోనస్‌ను రూ.819 కోట్లకు తగ్గించిందని ఆరోపించారు. రూ.2,040 కోట్లు చెల్లించాల్సిన స్థానంలో రూ.819 కోట్లు మాత్రమే ఇస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చే బోనస్ శాతం ఎంతో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. సంస్థ విస్తరణ మంచిదే కానీ కార్మికుల శ్రమను దోపిడీ చేయడం ఏమాత్రం సరికాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కార్మిక వ్యతిరేకమే అన్నది ఈ చర్యతో స్పష్టం అయ్యిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కార్మికుల సొమ్మును పక్కదారి పట్టిస్తూ సంస్థ అభివృద్ధి పేరిట వందలు, వేల కోట్లను దోచుకుంటున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story