నా పార్టీ జెండాలో అందుకే పసుపు రంగు ఉంది.. కవిత కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-31 06:38:10  IST  )

తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంక‌ర్ మాట్లాడుతూ.. జెండా రంగులో ఆకుపచ్చ పసుపు రంగును ఎందుకు ఎంచుకున్నారు? టీడీపీ అంటే ప‌సుపు అనే బ్రాండ్ గా మారింది క‌దా అని ప్ర‌శ్నించారు.

నా పార్టీ జెండాలో అందుకే పసుపు రంగు ఉంది.. కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంక‌ర్ మాట్లాడుతూ.. జెండా రంగులో ఆకుపచ్చ పసుపు రంగును ఎందుకు ఎంచుకున్నారు? టీడీపీ అంటే ప‌సుపు అనే బ్రాండ్ గా మారింది క‌దా అని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా మిమ్మ‌ల్ని న‌డిపించేది తెలుగు దేశం, చంద్ర‌బాబు అనే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి క‌దా అని అడిగారు. దానికి క‌విత స‌మాధానం ఇస్తూ.. ప‌సుపు అంటే త‌న‌కు చాలా ఇష్టం అని చెప్పారు. ప‌సుపు రంగు భూమి పుట్టిన‌ప్ప‌టి నుండి ఉంద‌ని కేవ‌లం తెలుగు దేశం అంటే అన్యాయం అని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు ప‌సుపు అనేది చాలా సెంటిమెంట్ అని చెప్పారు. నిజామాబాద్ లో ఎక్కువ పండించేది పసుపే అని అన్నారు. అంతే కాకుండా ప్ర‌తి ఆడ‌బిడ్డ‌కు ప‌సుపు అనేది సెంటిమెంట్ అని అన్నారు.

జీవిత‌కాలం ప‌సుపుకుంకుమ‌లు ఉండాల‌ని ఆడ‌బిడ్డ‌లు కోరుకుంటార‌ని అన్నారు. ప‌సుపు అంటే వెలుతురు, స‌మృద్ధి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ స‌మృద్ధిగా ఉండాల‌ని తాను పసుపు రంగును జెండాలో చేర్చిన‌ట్టు చెప్పారు. జాగృతి నుండి తాము పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగామ‌ని అందుకే త‌న జెండా రంగులో జాగృతి జెండాలోని ఆకుప‌చ్చ రంగును తీసుకున్నామ‌ని అన్నారు. రైతుల కోసం,మైనారిటీ కమ్యూనిటీల‌ను కూడా రిప్రెంజెంట్ చేయ‌డానికి ఆకుప‌చ్చ రంగుకు ఎంచుకున్నామ‌ని తెలిపారు. నీలి రంగు అనేది శ్రామికుల రంగు అని అన్నారు. ఎస్సీలు, శ్రామిక వార్గాలు, స‌మాజిక తెలంగాణ కోసం జెండాలో నీలి రంగు చేర్చామ‌ని చెప్పారు. త‌న పార్టీలోని ప‌సుపు రంగుకు చంద్ర‌బాబుకు, రేవంత్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. త‌న‌ను ఎవ‌రూ న‌డిపించ‌డంలేద‌ని తాను స్వ‌తంత్య్రంగా రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story