‘మీ ప్రభుత్వం చేస్తున్నది చాలా పెద్ద తప్పు’.. CM రేవంత్‌పై కవిత కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మీ ప్రభుత్వం చేస్తున్నది చాలా పెద్ద తప్పు’.. CM రేవంత్‌పై కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను మరోసారి దగా చేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘2024-25 సంవత్సరానికి 69.01 MT బొగ్గు ఉత్పత్తి చేయడంతో సింగరేణి(Singareni)కి రూ.6వేల కోట్ల నికర లాభాలు వస్తాయని చెప్పారు. సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. ఈ లెక్కన సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ రూపేణా రూ.2,040 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తీరా ఇప్పుడు చూస్తే ప్రభుత్వం ఏవేవో సాకులు చెప్పి కార్మికులకు ఇచ్చే లాభాల బోనస్‌ను రూ.819 కోట్లకు తగ్గించింది. రూ.2,040 కోట్లు చెల్లించాల్సిన స్థానంలో రూ.819 కోట్లు మాత్రమే ఇస్తోంది. సంస్థ విస్తరణ మంచిదే కానీ కార్మికుల శ్రమను దోపిడీ చేయడం ఏమాత్రం సరికాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కార్మిక వ్యతిరేకమే అన్నది ఈ చర్యతో స్పష్టం అయ్యింది. కార్మికుల సొమ్మును పక్కదారి పట్టిస్తూ సంస్థ అభివృద్ధి పేరిట వందలు, వేల కోట్లను దోచుకుంటున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది’ అని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story