- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025 నాకు కలిసి రాలేదు : కల్వకుంట్ల కవిత
2025 సంవత్సరం తనకు ఏమాత్రం కలిసి రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : 2025 సంవత్సరం తనకు ఏమాత్రం కలిసి రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఏడాది పొడవునా ఎన్నో కుట్రలు, అవమానాలు, కష్టాలు, రాజకీయ సవాళ్లను తాను ఎదుర్కొన్నానని చెప్పారు. ఎంత ప్రయత్నించినా చివరికి తనపై కుట్రలు చేసినవాళ్లే గెలిచారని, అందుకే వారు ఇప్పటికీ పార్టీలో పదవులతో కొనసాగుతుండగా తాను మాత్రం బయట ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదని, బీఆర్ఎస్‌లోని ఒక వర్గం 2019 నుంచే తనకు వ్యతిరేకంగా పథకాలు వేసి, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించిందని ఆరోపించారు.
తాను ఏ తప్పూ చేయలేదని, ప్రజల కోసం, ఉద్యమం కోసం మాత్రమే పనిచేశానని కవిత స్పష్టం చేశారు. అన్యాయం జరిగిందన్న బాధ ఉన్నప్పటికీ, ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. తనను ఓడించేందుకు ఎంతమంది కలిసి పనిచేసినా, తాను మాత్రం ధైర్యంగా నిలబడతానని, ఎవరినీ భయపడబోనని అన్నారు. ఈ పరిణామాలన్నీ తనకు మానసికంగా బాధ కలిగించినా, ప్రజల మద్దతు, తన ఆత్మవిశ్వాసమే తనకు బలం అని పేర్కొన్నారు.






