నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. CM రేవంత్ అభినందనలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-07 16:42:49  IST  )

ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తోన్న విషయం తెలిసిందే.

నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. CM రేవంత్ అభినందనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా కాళోజీ పురస్కారానికి కవయిత్రి, కాలమిస్ట్‌ నెల్లుట్ల రమావేవిని ఎంపిక చేశారు. ఈ మేరకు అందెశ్రీ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున రమాదేవికి పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఆమెకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు.

రమాదేవి గురించి...

నెల్లుట్ల రమాదేవి ఉమ్మడి వరంగల్​జిల్లా స్టేషన్​ఘన్​పూర్‌లో జన్మించారు. ఆర్థికశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కాలక్రమంలో సాహిత్యంపై దృష్టి పెట్టారు. ఆంధ్రా బ్యాంక్‌, హన్మకొండ నక్కలగుట్ట బ్రాంచ్‌లో జోనల్‌ ఆఫీసర్‌ పనిచేశారు. ప్రవృత్తి కవయిత్రి, రచయిత్రి, కార్టూనిస్ట్‌. కథలు, కవితలు, వ్యాసాలు రాయడంతో పాటు కార్టున్లు గీయడం ఆమెకు హాబీ. మనసు మనసుకూ మధ్య – కథాసంపుటి, మనసు భాష – కవితా సంపుటి, రమణీయం – కార్టూన్ల సంపుటి ఈ మూడు సంపుటాలు డిసెంబర్‌ 2011న ఒకే వేదిక మీద అవిష్కరించారు. మనసు మనసుకూ మధ్య శీర్షికతో ఈమె మొదటి కథా సంకలనం వెలువడింది. ఇందులో మొత్తం 26 కథలున్నాయి. ఈ కథలన్నీ కూడా ఏదో ఒక పత్రికలో అచ్చుకాబడినవే. విభిన్న అంశాల నేపథ్యంతో రాయబడ్డ కథలు.

నెల్లుట్ల రమాదేవి కథల్లో చాలా వాటిల్లో స్త్రీయే కేంద్ర బిందువు. ఆమె చుట్టూనే కథ సాగుతుంది. ఇందులో పెళ్ళికాని అమ్మాయి నుండి జీవిత చరమాంకంలో ఉన్న స్త్రీ వరకు అన్ని దశల స్త్రీలు ఉంటారు. ఈమె కథలన్నీ మధ్య తరగతి కుటుంబ జీవనాన్ని, వారి అంతర్మధనాన్ని ప్రస్పుట పరుస్తాయి. అయితే రచయిత్రికి దిగువమధ్య తరగతి వారిపై కొంత సానుభూతి, ఆదరణ ఉన్నట్లు ఈమె కథలు చెపుతున్నాయి. ఈ కాలం నాటి అమ్మాయిలు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో స్వతంత్రంగా ఆలోచిస్తున్నారని, ఆ విషయాన్ని ధైర్యంగా బయట పెడుతున్నారని రచయిత్రి కొన్ని కథల్లో చూపించారు.

Next Story