Kaleswaram Commission: కాళేశ్వరం పై 400 పేజీల రిపోర్ట్ రెడీ.. ఇక విచారణకు కేసీఆర్!

by Prasad Jukanti |

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ్టి నుంచి తుది దశ విచారణ మొదలు పెట్టింది.

Kaleswaram Commission: కాళేశ్వరం పై 400 పేజీల రిపోర్ట్ రెడీ.. ఇక విచారణకు కేసీఆర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) నేటి నుంచి తుది దశ విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించిన కమిషన్ దాని ఆధారంగా 400 పేజీల నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసిన కమిషన్ ఎన్‌డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తది నివేదిక కోసం ఎన్డీఎస్ఏ‌కు మరోసారి లేఖ రాసింది. ఆ నివేదిక మరో మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టును అందజేయనుంది.

కీలక దశకు విచారణ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు అక్రమాలపై విచారణ కోసం 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో విచారణ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే పలుసార్లు కమిషన్ గడవును పొడిగించగా ఈ నెలాఖరుతో గడవు ముగియనుంది. ఈనేపథ్యంలో మరోసారి ప్రభుత్వం కమిషన్ గడవు పొడిగించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ దశలో మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story